ఎంత ఖర్చయినా సరే.. చైనా–పాక్ కారిడార్ పూర్తి చేస్తం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. సీపీఈసీ ప్రాజెక్టు పురోగతిపై శనివారం జరిగిన రివ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. ‘‘ఈ కారిడార్ చైనా-పాక్ ఫ్రెండ్ షిప్ కు నిదర్శనం. ఎంత ఖర్చయినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తాం. ప్రతి పాకిస్తానీకి దాని ఫలితాలు అందుతాయి’’ అని ఇమ్రాన్ అన్నారు.

Latest Updates