
సర్జికల్ మెటీరియల్కూ కరువు
టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచి సప్లై అంతంతే
100 ఆపరేషన్లు పెండింగ్‌లో
3 కోట్ల బిల్లులు పెండింగ్.. సర్కార్ ఇచ్చింది 3 లక్షలే
ఆఫీసర్లు పట్టించుకుంటలేరని డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: నిలోఫర్ చిల్డ్రన్హాస్పిటల్లో చిన్నారులకు టైమ్ కి ట్రీట్మెంట్ అందడంలేదు. సర్జరీలు ఎమర్జెన్సీ అయినప్పటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటీరియల్ లేకపోవడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి12 ఏళ్లలోపు పిల్లల వరకు రోజూ 20 సర్జరీలు జరుగుతున్నాయి. ఇవికాకుండా దవాఖానలో ఎప్పుడూ వందకుపైగా సర్జరీలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కొద్ది రోజులుగా మెటిరీయల్ లేకపోవడం వల్ల కొన్ని సర్జరీలు వాయిదా పడుతున్నాయి. రోజుల పాటు వెయిట్చేసినా సర్జరీ జరగకపోతుండటంతో పేషెంట్లు ఇతర మార్గాన్ని చూసుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) నుంచి టైమ్‌కి రాకపోవడంతోనే ఈ కొరత ఏర్పడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇండెంట్ లో పంపించినన్ని మందులు కూడా రావడంలేదని అంటున్నారు. ఈ విషయాన్ని కొద్ది రోజులక్రితం డాక్టర్లు నేరుగా డీఎంఈకి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. అవసరమైన వాటిని ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కొనుగోలు చేయాలని సూపరింటెండెంట్‌ను డీఎంఈ ఆదేశించారు. ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో పేషెంట్లతో కలిసి డాక్టర్లు ఆందోళనకు సైతం దిగారు. స్వయంగా నిలోఫర్సర్జికల్ హెచ్‌వోడీ డాక్టర్ నరేంద్రకుమార్పేషెంట్లతో కలిసి హాస్పిటల్లో నిరసన తెలిపారు. హాస్పిటల్లో సర్జికల్మెటిరీయల్లేకపోతే సర్జరీలు ఎలా చేయాలని మండిపడ్డారు.
మందులొస్తలే.. టైంకి టెస్టులూ చేస్తలే
మెడిసిన్స్, సర్జికల్మెటిరీయల్స్కోసం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పంపుతున్నా, అక్కడి నుంచి అవసరమైనంత సప్లై కావడంలేదు. ప్రస్తుతం సరైనంత సర్జికల్ మెటిరియల్ రాకపోవడంతోనే నిలోఫర్‌లో ఈ సమస్య ఏర్పడినట్లు చెప్తున్నారు. మెడిసిన్స్ లో కూడా ఎక్కువగా డిమాండ్ఉన్నవి తక్కువగా సప్లై చేస్తున్నారు. దీనివల్ల పేషెంట్లపై తీవ్రస్థాయిలో ఎఫెక్ట్ పడుతోంది. మెడిసిన్స్లేకపోవడంతో బయటనుంచి కొనుగోలు చేయక తప్పడంలేదు. నిలోఫర్పేరుకే సర్కార్దవాఖాన, అక్కడకు వెళ్లిన రోగులు ప్రైవేట్ హాస్పిటల్ గానే ఫీల్అవుతున్నారు. మెడిసిన్స్‌తో పాటు ఇంజెక్షన్లు, గ్లూక్లోజ్పెట్టేందుకు క్యాన్ లు సైతం లేకపోవడంతో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్స్కానింగ్ తదితర టెస్టులు కూడా హాస్పిటల్లో టైమ్‌కి చేయడంలేదు. దీంతో పేషెంట్లు టెస్టులను కూడా బయట చేయించుకోవాల్సి వస్తోంది.
గతేడాది ఇచ్చింది 3 లక్షలే
ప్రభుత్వం ప్రతి హాస్పిటల్‌కు ప్రత్యేక ఫండ్స్ కేటాయించాలి. కానీ ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్ కు ఆశించిన స్థాయిలో నిధులు అందడంలేదు. నిలోఫర్‌కు గతంలో ఏటా కోటికిపైగా నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు లక్షల్లో మాత్రమే వస్తున్నాయి. గతేడాది మొత్తానికి కేవలం రూ. 3 లక్షలు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయి. దీంతో అన్నింటికోసం ఆరోగ్యశ్రీ నిధులనే వాడుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రతినెలా రూ.15 లక్షలను ఆరోగ్యశ్రీ ఫండ్స్ నుంచి వాడుకుంటున్నారు.
ఇప్పటికే 3 కోట్ల బకాయిలు
టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా కాని మెడిసిన్స్, సర్జికల్మెటిరీయల్ని బయట నుంచి కొనుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మెటీరియల్ బిల్లులు రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. వీటి కోసం వెయిట్ చేస్తున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు టైమ్‌కి సరఫరా చేయకపోవడం కూడా సర్జరీలు ఆగడానికి కారణమవుతోందని సమాచారం.
ఆరోగ్యశ్రీ నిధులతోనే కొంటున్నం
టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచి కావలిసినంత మెటిరీయల్రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిధులతోనే ఎప్పటికప్పుడు కొంటున్నం. హాస్పిటల్లో మెడిసిన్స్, సర్జికల్ మెటిరీయల్ కొరత ఉందన్నది అబద్ధం. పేషెంట్లకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. స్టోర్ రూమ్ ఒక బిల్డింగ్‌లో, సర్జరీలు మరోక బిల్డింగ్‌లో జరుగుతుండటంతో ఈ సమస్య వస్తోంది. హాస్పిటల్లో రెండు నెలలకు కావాల్సినంత మెటిరీయల్స్టాక్ ఉంది.
– డాక్టర్ మురళీ కృష్ణ, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్
For More News..