న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీలో చైనీస్‌ భాష తొలగింపు

  • డ్రాఫ్ట్‌లో ఆ భాషను తొలగించిన మినిస్ట్రీ

న్యూఢిల్లీ: ఇటీవల తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020లోని విదేశీ భాషలో చైనీస్‌ ల్యాంగ్వేజ్‌ను అధికారులు తొలగించారు. సెకండరీ స్కూల్‌ స్టూడెంట్స్‌ ప్రంపచ సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు, ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు విదేశీ భాషను నేర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత ఏడాది రిలీజ్‌ చేసిన డ్రాఫ్ట్‌లో ఫ్రెంచ్‌, జర్మనీ, స్పానిష్‌, జపనీస్‌తో పాటు చైనా ల్యాంగ్వేజ్‌ను కూడా అధికారులు లిస్ట్‌ చేశారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌‌ రిలీజ్‌ చేసిన ఫైనల్‌ వర్షన్‌ ఎన్‌ఈపీలో చైనా భాషను తొలగించారు. ఆ ప్లేస్‌లో కొరియన్‌, రష్యన్‌, పొర్చుగీస్‌ని యాడ్‌ చేశారు. దీంతో పాఠశాల స్థాయిలో చైనా ల్యాంగ్వేజ్‌ అభ్యసించే వీలు లేదని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాల్వాన్‌ ఇష్యూ జరిగిన తర్వాత చైనాను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగానే చైనాకు చెందిన దాదాపు 59 యాప్‌లపై కేంద్రం బ్యాన్‌ విధించింది. దాంట్లో టిక్‌టాక్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. రెండో విడతలో మరో 45 యాప్స్‌ను కూడా బ్యాన్‌ చేశారు.

Latest Updates