రేపిస్ట్ లపై దయచూపించాల్సిన అవసరం లేదు: రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్

రేపిస్ట్ ల పట్ల దయచూపించాల్సిన అవసరం లేదని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

నిర్భయ కేసు నిందితుల కేసు 2012డిసెంబర్ నుంచి 2019 అంటే సుమారు ఏడు సంవత్సరాలైన నిందితులకు మరణశిక్ష అమలు కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ నిర్భయ కేసులో ప్రధాన ముద్దాయి వినయ్ శర్మ కేంద్రప్రభుత్వ రిజక్ట్ చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కు రికమండ్ చేసినట్లు గా తెలుస్తోంది. ట్రైయిల్ కోర్ట్ సైతం ఇప్పటికే నిందితుల్ని ఉరితీయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆరుగురు నిందితుల్లో 18సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కారణంగా రెండు సంవత్సరాల జైలుశిక్షతో భయటపడ్డాడు. మరో నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరిశిక్ష వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులకు కింది కోర్ట్ లు, హైకోర్ట్ లు సైతం 2017లో నిందితులకు ఉరిశిక్ష సరైందేనని తీర్పునిచ్చాయి.

అయితే ఈ కేసునుంచి భయటపడేందుకు నిందితులు స్టేట్ గవర్నమెంట్ , రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరడంతో కేసు విచారణకు ఆలస్యమైంది.

ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపటిక్రితం కేంద్ర హోంశాఖ క్షమాభిక్షపై రాష్ట్రపతికి రికమండ్ చేసినట్లు సమాచారం. క్షమాభిక్షపెట్టాలని రాష్ట్రపతిని కోరినా..ముందుగా కేంద్ర హోంశాఖ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. నిర్భయ కేసు ప్రధాన నిందితుడు వినయ్ శర్మ క్షమాబిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. క్షమాభిక్ష పటిషన్ పై స్పందించిన కేంద్రప్రభుత్వం..వినయ్ శర్మ క్షమాభిక్ష పటిషన్ ను తిరస్కరించాలని రాష్ట్రపతి కోవింద్ నాథ్ కు ఓ సలహా ఇచ్చినట్లు సమాచారం.

సాధారణంగా రాష్ట్రపతి కేంద్రప్రభుత్వం సలహాలను ఫాలో అవుతుంటారు. అదే సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోక్స్ చట్టంపై మాట్లాడారు. 12సంవత్సరాల వయసుకంటే తక్కువ ఉన్నవారిపై ఎవరైతే అత్యాచారం చేస్తారో..అటువంటి వారి విషయంలో క్షమాభిక్ష ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతేడాది 12సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిపై హత్యచారం చేసిన నిందితుల్ని ఉరిశిక్ష విధించాలంటూ ఓ చట్టం తెచ్చారు. అటువంటి కేసుల్లో క్షమాభిక్ష పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉండకూడదు. ఇటీవల జరుగుతున్న అత్యాచారాలపై రామ్ నాథ్ కోవింద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాభిక్ష పిటిషన్లపై కామెంట్ చేశారు.

ఆ తరువాత కొద్దిసేపటికే కేంద్ర హోంశాఖ కూడా నిర్భయ నిందితుడైన వినయ్ శర్మ క్షమాభిక్ష పటిషన్ ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా కేంద్ర హోంశాఖ రికమండ్ చేస్తే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు.

దీంతో తాజా పరిణామాలతో త్వరలో నిర్భయ నిందితులకు త్వరలో మరణశిక్ష అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates