బీసీ ఫెడరేషన్లకు పైసల్లేవంట: ఈసారీ నిధులివ్వని సర్కార్​

    లక్షల్లో లోన్‌‌ అప్లికేషన్లు పెండింగ్‌‌

    ఊసే లేని బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధి

    బీసీ సంక్షేమ శాఖకు 4,356  కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఫెడరేషన్లకు నిధులు కేటాయించలేదు. మూడేళ్లుగా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆయా కులాలు, వృత్తుల వారు నష్టపోతున్నారు. లోన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షల్లో పెండింగ్​లో ఉన్నాయి. కుల వృత్తుల శిక్షణ ఇచ్చినా నిధుల్లేక పరికరాలు ఇవ్వడంలేదు. తెలంగాణ బీసీ కమిషన్‌‌కు ఒక్క పైసా కూడా పెట్టలేదు. ఎంబీసీ కార్పొరేషన్‌‌కు మాత్రం 500 కోట్లు కేటాయించారు. గతేడాది దీనికి కేవలం 5 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వెనకబడిన తరగతులకు ప్రత్యేక అభివృద్ధి నిధి అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదు. బీసీల సమగ్ర అభివృద్ధికోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్‌‌ కమిటీలోని మెజార్టీ సభ్యులు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు వైపే మొగ్గు చూపారు. కానీ బడ్జెట్‌‌లో దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో ప్రకటించిన బీసీ పాలసీ అమలునూ పెండింగ్‌‌లో పెట్టారు. కొత్త స్కీంలు ఏవీ ప్రకటించలేదు.

బీసీలకు 1,089.42 కోట్లు పెరిగినయ్‌‌..

బీసీ సంక్షేమ శాఖకు 4,356.82 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద 453.24 ట్లు, ప్రగతి పద్దు కింద 3903.59 కోట్లు ప్రతిపాదించారు. గతేడాది మాత్రం 3267.4 కోట్లు  మాత్రమే కేటాయించారు. ఈసారి 1,089.42 కోట్ల కేటాయింపులు పెరిగాయి.

Latest Updates