సుశాంత్ డెత్ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదు: అనిల్ దేశ్ ముఖ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఇటీవల డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతున్నారు. రియా చక్రవర్తి దీనిపై అమిత్ షాకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే, సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని …ముంబై పోలీసుల విచారణ సరిపోతుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు.

ఇలాంటి కేసులను చేపట్టడంలో ముంబై పోలీసులు సమర్థవంతలన్నారు అనిల్ దేశ్ ముఖ్ .సుశాంత్ కు బాలీవుడ్ లో ఉన్న వృత్తి వైరం సహా అనేక కోణాల్లో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీబీఐతో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఎవరి తప్పిదం ఉన్నట్టు తెలియరాలేదని… దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక వివరాలు తెలుపుతామన్నారు అనిల్ దేశ్ ముఖ్.

Latest Updates