అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదు : భారత్

భారత్, చైనా బలగాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది.   చైనాతో తాము ఈ వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేసింది.  ఇటు ఢిల్లీలోనూ, అటు బీజింగ్ లోనూ చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ చర్చలు దౌత్య స్థాయిలోనూ, సైనిక వర్గాల స్థాయిలోనూ చేపట్టినట్టు వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, నిశ్చింత వాతావరణం నెలకొల్పేందుకు రెండు దేశాల మధ్య అనేక అగ్రిమెంట్లు ఉన్నాయని తెలిపారు. ట్రంప్ గతంలోనూ ఇదే విధంగా భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి ఆసక్తి చూపినా, ఆ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది.

Latest Updates