ఆగస్టు తరువాత మారటోరియం అవసరం లేదు

స్టేట్ బ్యాంక్ చీఫ్ రజనీశ్ కుమార్

ముంబై: లోన్లవాయిదాల చెల్లింపునకు మారటోరియం వచ్చే నెల తరువాత అవసరం లేదని స్టేట్ బ్యాంక్ చీఫ్ రజనీశ్ కుమార్ అన్నారు. ఈ విషయంలో ఆర్‌‌‌‌బీఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు తెలియజేశారు. మారటోరియానికి సంబంధించిన అన్ని వివరాలూ ఆర్‌‌‌‌బీఐ దగ్గర ఉన్నాయని, రాబోయే నెలల్లో సెక్టార్ల వారీగా దాని ప్రాధాన్యాలు మారొచ్చని చెప్పారు. కొన్ని సెక్టార్లకు ఇప్పటికీ సాయం అవసరమని స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ నిర్వహించిన రెండు రోజుల వర్చువల్ కాన్ క్లేవ్ లో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు కస్టమరలో 20 శాతం మంది మారటోరియం తీసుకున్నారని వెల్లడించారు. ఇదేమీ భారీ సంఖ్య కాదని కుమార్ అన్నారు. మారటోరియంను డిసెంబరు దాకా ఆర్‌‌‌‌బీఐ పొడిగిస్తుందని మీడియాలో వార్తలు రావడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆరు నెలలపాటు మారటోరియం ఇవ్వడం సరికాదని, భారీగా నష్టాల్లో ఉన్న కంపెనీలకు మాత్రమే కొంత వెసులుబాటు ఇవ్వాలన్నారు.

For More News..

ట్రెయినింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ప్లేయర్

ఊపందుకున్న సైకిల్ సవారీ

గ్రేటర్లో కరోనా మృతులకోసం ప్రత్యేక శ్మశానాలు!

Latest Updates