హాత్రాస్ గ్యాంగ్ రేప్ : కేసును ఢిల్లీకి బదిలీ చేయలేం..యూపీ హైకోర్ట్ చూసుకుంటుంది

ఉత్తర్ ప్రదేశ్ హాత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం కోర్ట్  చీఫ్ జస్టీస్ శరద్ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్యాంగ్ రేప్ కేసు విచారణను ఉత్తర్ ప్రదేశ్ హైకోర్ట్ నుంచి ఢిల్లీ హైకోర్ట్ కు మార్చాలంటూ బాధితురాలి బంధువులు,పలువురు పిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టీస్ బాబ్డే మాట్లాడుతూ ఈ కేసు విచారణపై  బాధితురాలి కుటుంబసభ్యులు ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు.  ఈ కేసును సీబీఐ అధికారులు  దర్యాప్తు చేస్తున్నారని, వారిపై పర్యవేక్షణ తగదన్నారు. ఈకేసుకు సంబంధించింది అన్నీ అంశాలను ఉత్తర్ ప్రదేశ్  హైకోర్ట్ పరిశీలిస్తున్నట్లు సూచించారు. విచారణ ప్రారంభ దశలో ఢిల్లీకి లేదా మరే రాష్ట్రానికి బదిలీ చేయబడదు”అని  సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

Latest Updates