బ్లాక్ కోటు, గౌను కొన్ని రోజులు వద్దు

  • లాయర్లకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచన

న్యూఢిల్లీ : కరోనా సమస్య పరిష్కారమయ్యే వరకు లాయర్లు బ్లాక్ కోటు, గౌన్ వేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే జరిగే విచారణలో వైట్ షర్ట్, లేడీ లాయర్లు అయితే సల్వార్ కమీజ్ లేదంటే చీర కట్టుకొని వాదించవచ్చని తెలిపింది. వైట్ నెక్ బ్యాండ్ తప్పకుండా ధరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్. ఎ బోబ్డే తెలిపారు. ఓ ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించి వీడియో కాన్సరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా ఆయన లాయర్లకు ఈ సూచనలు చేశారు. బ్లాక్ కోటు, గౌనును కొన్ని రోజులు ధరించటం మానేద్దాం అన్నారు. వీటి ద్వారా కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ముప్పు ఉందని ఆయన అన్నారు. విచారణ సందర్బంగా చీఫ్ జస్టిస్ సహా ఇతర జడ్జిలంతా వైట్ షర్టు వేసుకొనే విచారణ చేపట్టారు.

Latest Updates