ఆహారం, ప్యాకేజింగ్ ల ద్వారా కరోనా సోకదు: WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా భయాందోళనలే కనిపిస్తున్నాయి. దేన్ని ముట్టుకోవాలన్నా జనాలు భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా సోకదని ప్రకటించింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను WHO ఆధారాలుగా చూపింది.

Latest Updates