మా సంకల్పాన్ని సందేహించొద్దు

న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్ వివాదంపై గురువారం పార్లమెంట్ సెషన్‌‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. సంప్రదాయ సరిహద్దు అమరికను చైనా ఒప్పుకోవట్లేదన్నారు. ‘బార్డర్ వివాదం క్లిష్టమైనది. దీన్ని ఓపికతో పరిష్కరించాలి. రెండు దేశాలు దీన్నే నమ్ముతున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖను సాధారణంగా నిర్వచించలేం. ఇరు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చైనా అడ్డంకులు సృష్టిస్తోంది. డ్రాగన్ సైనికులకు మన జవాన్లు దీటుగా బదులిచ్చారు. దేశ సరిహద్దులను కాపాడటంలో మా సంకల్పం, చిత్తశుద్ధిని ఎవరూ సందేహించొద్దు. ద్వైపాక్షిక ఒప్పందాలను భంగపరిచేలా చైనా చర్యలు ఉన్నాయి. అందుకే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌‌ను అనుక్షణం అప్రమత్తతతో పర్యవేక్షిస్తున్నాం’ అని రాజ్‌‌నాథ్ పేర్కొన్నారు.

Latest Updates