అన్‌‌సోల్డ్‌‌గా మిగిలినందుకు బాధ లేదు

క్రైస్ట్‌‌చర్చ్‌‌: ఐపీఎల్‌‌ ఆక్షన్‌‌లో అన్‌‌సోల్డ్‌‌గా మిగిలిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆస్ట్రేలియా వైట్‌‌బాల్‌‌ కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ అన్నాడు. మరికొంత టైమ్‌‌ ఇంటి వద్ద గడపడం పెద్ద సమస్యేమీ కాదన్నాడు. వీలైనంత త్వరగా తాను ఫామ్‌‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈలో జరిగిన లీగ్‌‌లో ఫించ్‌‌ బెంగళూరు తరఫున ఒకే ఒక్క ఫిఫ్టీ చేశాడు. బిగ్‌‌బాష్‌‌లోనూ 13 మ్యాచ్‌‌ల్లో 179 రన్సే చేయడంతో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు.

‘ఐపీఎల్‌‌లో ఆడి ఉంటే బాగుండేది. చాలా పెద్ద టోర్నీ. మంచి కాంపిటీషన్‌‌ ఉంటుంది. కానీ ఈ సారి నాకు ఆ అదృష్టం లేదు. అయితే నన్నెవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేయలేదు. నిజాయితీగా చెబుతున్నా. క్రికెట్‌‌ ఆడటానికి ప్రాధాన్యత ఇస్తా. లేకపోయినా ఇంటి దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడతా. ఆగస్ట్‌‌ నుంచి ఫుల్‌‌ షెడ్యూల్‌‌తో బిజీగా ఉన్నాం. యూకేలో దిగినప్పట్నించి క్వారంటైన్‌‌, బబుల్‌‌లోనే కొనసాగుతున్నాం. కాస్త బోరింగ్​గా ఉంది కాబట్టి ఐపీఎల్‌‌ బ్రేక్‌‌ను ఫ్యామిలీతో గడుపుతా’ అని ఫించ్‌‌ వ్యాఖ్యానించాడు.

Latest Updates