నో పార్కింగ్ దగ్గర బండి ఆపితే రూ. 23 వేల ఫైన్

no-parking-fines-big-mumbai

ముంబైలో ట్రాపిక్స్ రూల్స్ పై చర్యలు చేపట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు విధించేలా నిర్ణంయం తీసుకుంది. పెంచిన ఫైన్ జూల్పై- 7 నుంచి అమలు చేయన్నారు. నోపార్కింగ్‌ జోన్‌ లో వాహనాన్ని నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు ఫైన్‌ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్‌ ప్రదేశాలు, బీఈఎస్‌టీఎస్‌ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.

మారిన నిబంధనల ప్రకారం బైక్స్ రాంగ్‌ పార్కింగ్‌లో నిలిపితే రూ.5వేల నుంచి రూ.8,300 వరకు, భారీ వాహనాలకు అయితే రూ.15 వేల నుంచి రూ.23,250 వరకు పైస్ విధిస్తారు. ఆటోలు ఈ రూల్స్ బ్రేక్ చేస్తే రూ.8వేల నుంచి రూ.12,200 వరకు ఫైన్ కట్టాల్సిందే. లేట్ గా చెల్లించేవారికి ఎక్స్ ట్రా ఛార్జిలు కూడా విధించనున్నారు. జరిమానాలు విధించే సమయంలో వాహనదారులకు అధికారులకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో బీఎంసీ ఇప్పటికే ఎక్స్‌సర్వీస్‌ మెన్‌, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకొంది.

Latest Updates