బీఎస్ 4 వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కు నో పర్మిష‌న్

న్యూఢిల్లీ : బీఎస్ 4 వెహికిల్స్ ను అథారిటీల వద్ధ‌ రిజిస్ట‌ర్ చేసుకోవడానికి అనుమతి లేదని సుప్రీం కోర్టు శుక్ర‌వారం తెలిపింది. లాక్ డౌన్ టైమ్ లో అమ్మిన‌ వెహికిల్స్ ఇష్యూస్ పై నిర్ణ‌యం తీసుకునే వరకు రిజిస్ట‌ర్ కు అనుమతించమని స్ప‌ష్టం చేసింది. మార్చి చివరి వారంలో, 31 తర్వాత ఉన్న‌ లాక్ డౌన్ టైమ్ లో బీఎస్ 4 వెహికల్స్ ను విక్ర‌యించినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ చెప్పింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత బీఎస్ 4 వెహికల్స్ అమ్ముకునేలా ఇచ్చిన‌ ఆర్డ‌ర్ ను అంతకుముందే సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది.

రిలీఫ్ ను ఉపసంహరించుకుంది. వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా జరిపిన విచారణలో, తదుపరి ఆర్డ‌ర్ వచ్చేంత‌ వరకు ఎలాంటి బీఎస్ 4 వెహికిల్స్ ను అథారిటీల వద్ద‌ రిజిస్ట‌ర్ చేయడం కుదరదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మార్చి చివ‌రి వారంలో, ఆ తర్వాత‌ లాక్ డౌన్ టైమ్ లో ఆన్ లైన్ గా లేదా డైరెక్ట్ గా అమ్మిన‌ బీఎస్ 4 వెహికిల్స్ వివరాలను అందజేయాలని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ను బెంచ్ కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates