రేషన్ కావాలంటే మాస్క్ తప్పని సరి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. తప్పని సరిగా బయటకు వచ్చే వాళ్లు మాస్కులు ధరించాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. మాస్క్ లేకుండా రోడ్డుపైకి వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు ధరించకపోవడంపై పలు ఆంక్షలు కూడా విధించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మాస్కులు ధరిస్తేనే పెట్రోల్ పోస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. లేటెస్టుగా గోవా రాష్ట్రం మాస్క్‌ ధరించకపోతే పెట్రోల్‌ పోయకూడదని పెట్రోల్‌ బంకులకు ఆదేశించింది. మాస్కులు ధరించని వాళ్లకు రేషన్ సరుకులను కూడా ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. ‘నో మాస్క్- నో పెట్రోల్, నో రేషన్’ అన్న ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నట్లు గోవా ఉన్నతాధికారులు తెలిపారు.

Latest Updates