19ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ : అత్యాచారం జరలేదంటున్న ఉత్తర్ ప్రదేశ్ ఎస్పీ

ఉత్తర్ ప్రదేశ్ లో 19ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ కేసుపై దేశంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో పాటు దేశంలో ఉన్న ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.

కానీ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మాత్రం బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, నలుగురు నిందితులు ఆమెపై దాడి చేయడంతో నెర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆమె మరణించినట్లు హత్రాస్ జిల్లా ఎస్పీ విక్రంత్ వీర్ తెలిపారు. అంతేకాదు బాధితురాలి నాలుకను కట్ చేసినట్లు వస్తున్న ఆరోపణపై స్పందించారు. డాక్టర్ల వాగ్మూలం ఆధారంగా బాధితురాల్ని నాలుక కట్ చేయలేదని తేలింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని,  ఈ విషయాన్ని ఫోరెన్సిక్ వైద్యులు నిర్దారిస్తారన్నారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై గాయాలైనట్లు గుర్తులు ఏవీ లభ్యం కాలేదని హత్రాస్ ఎస్పీ తెలిపారు.

సెప్టెంబర్ 14న గ్యాంగ్ రేప్ జరిగిందా అని మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఎస్పీ విక్రంత్ వీర్ మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ జరగలేదని, బాధితురాలి తల్లిదండ్రులు సైతం తమ కుమార్తెపై దాడి మాత్రమే జరిగినట్లు వెల్లడించారు.

Latest Updates