బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించేందుకు ఎలాంటి ప్ర‌తిపాద‌న లేదు

బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించేందుకు ఎలాంటి ప్ర‌తిపాద‌న లేదు

బిట్ కాయిన్ పై కేంద్రం వైఖరిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  ఇవాళ(సోమవారం) పార్లమెంటులో స్పష్టం చేశారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా పరిగణించే ప్రతిపాదనలేవీ కేంద్రం చేయలేదని నిర్మలా వివరించారు. బిట్ కాయిన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్న ప్రచారంలో నిజంలేదన్నారు.

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా  లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ద్వారా సొంత డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో  దేశంలో బిట్ కాయిన్ తరహా ఇతర క్రిప్టోకరెన్సీలను అనుమతించేది లేదని నిర్మలా సీతారామన్  చెప్పిన మాటల్లో స్పష్టమైంది.