జూన్‌ 30 వరకు పబ్లిక్‌ మీటింగులు బ్యాన్‌

  • ప్రకటించిన యూపీ ప్రభుత్వం

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు ఎక్కువ అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30 వరకు సామూహిక సమావేశాలు నిర్వహించకూడదని శనివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 11 కమిటీల చైర్మన్లతో సమీక్ష నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. “ జూన్‌ 30 వరకు సామూహిక సమావేశాలపై బ్యాన్‌ కొనసాగుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అని యూపీ సీఎంవో ట్వీట్‌ చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో వారిని సొంత ఊళ్లకు తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. యూపీలో ఇప్పటి వరకు 1621 కేసులు నమోదు అయ్యాయి. వారిలో 247 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 25 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

Latest Updates