‘రేప్ ఇన్ ఇండియా’ కామెంట్ పై వెనక్కి తగ్గని రాహుల్

న్యూఢిల్లీ: జార్ఖండ్​ ఎన్నికల ప్రచార సభలో  చేసిన రేప్​ కామెంట్స్​పై వెనక్కి తగ్గేదిలేదని  కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ చెప్పారు.  దీనిపై అధికార బీజేపీ చేసిన  ఆరోపణల్ని పట్టించుకోబోనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ   ఈ ఇష్యూపై ‘సారీ’ చెప్పబోనని మొండికేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీని ‘రేప్​ కేపిటల్​’ అన్నందుకు ప్రధాని నరేంద్రమోడీ   ఇప్పడు క్షమాపణ చెప్పాలని రాహుల్ శుక్రవారం ​డిమాండ్​ చేశారు. బీజేపీ నాయకులకు అపాలజీ చెప్పే ప్రశ్నేలేదని ఆయన పార్లమెంట్​ బయట  మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.  “మోడీ ఎప్పుడూ ‘ మేడ్​ ఇన్​ ఇండియా’  గురించి మాట్లాడుతుంటారు.  దేశమంతటా ఇప్పుడు అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ న్యూస్​పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే  ‘ రేప్​ ఇన్​ ఇండియా’ అని కామెంట్ చేయాల్సి వచ్చింది’ అని రాహుల్​ వివరణ ఇచ్చారు. “బీజేపీ , ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్​ షా ఈశాన్య రాష్ట్రాలకు నిప్పు పెట్టారు.  ఈ ఇష్యూ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే  తెలివిగా  బీజేపీ నేను చేసిన కామెంట్స్​ను హైలైట్​ చేస్తుంది” అని ఆయన వివరించారు.  ఢిల్లీని రేప్​ కాపిటల్​ అంటూ మోడీ  చేసిన కామెంట్స్​కు సంబంధించిన వీడియో క్లిప్​ లు తన ఫోన్లో ఉన్నాయని రాహుల్​ చెప్పారు.

‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మాత్రమే కాదు,  దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినందుకు,  యువతకు రావాల్సిన ఉద్యోగాలను లాక్కున్నందుకు కూడా నరేంద్రమోడీ సమాధానం చెప్పాలి”అని రాహుల్​ డిమాండ్​ చేశారు. జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చేసిన కామెంట్స్​ను రాహుల్​ వివరించారు. “బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉన్నావ్​(యూపీ)లో బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాధితురాలు వెళ్తున్న వెహికిల్ కు యాక్సిడెంట్​చేయించారు.  దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఒక్కమాట మాట్లాడరు.  నిందితులపై ఎలాంటి యాక్షన్​ తీసుకోరు”అని రాహుల్‌ ఆరోపించారు.

 

Latest Updates