టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు: మంత్రి

జైపూర్‌: టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు దేశంలో ఎలాంటి అత్యాచారాలు జరగలేదని, అవి కనిపెట్టాకే ఇలాంటి రేప్ ఘటనలు అధికమయ్యాయని రాజస్థాన్ మంత్రి అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్.. హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ రేప్ ఘటనపై  మీడియాతో మాట్లాడారు. అసలు సమస్య అంతే టీవీలు, మొబైల్ ఫోన్ల వల్లేనని,  ఈ తరం యువత వాటిని ఎక్కువ చూడటం మూలంగా అకృత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. టీవీలు లేకుండా ఉండి ఉంటే అత్యాచారాలు జరిగేవి కావని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ ఘటనపై దేశ ప్రజలంతా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతుంటే.. కొందరు ప్రముఖులు మాత్రం ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం డేనియల్‌ శ్రావణ్‌ అనే బాలీవుడ్‌ నిర్మాత రేప్ చేయబోతున్న వ్యక్తికి కండోమ్ ఇచ్చి  మహిళలు తమ ప్రాణాలు రక్షించుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Latest Updates