బుకింగ్స్ పేజీ క్లోజ్: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇప్పట్లో ఎగరవు..!

న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఇప్పట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎగిరేలా కనిపించడంలేదు. జూలైకి ముందు ఇండియా నుంచి ఏ ఇంటర్నేషల్ ఫ్లైట్స్ ను ప్రభుత్వం అనుమతించదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నాయి. అర్జెంట్ గా ఇంటర్నేషనల్ ట్రావెల్‌కు అనుమతించే అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపాయి.

కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడమేని అన్నారు. అయితే శనివారమే ఎయిరిండియా తన బుకింగ్ విండోను రీఓపెన్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ.. దేశీయ, అంతర్జాతీయ ఆపరేషన్స్ ప్రారంభించడంపై ఇంక ఎలాంటి నిరయం తీసుకోలేదనిపేర్కొంది. ప్రభుత్వ నిరయం వ‌చ్చిన‌ తర్వాతనే ఎయిర్‌లైన్ సంస్థలు బుకింగ్స్ ను ఓపెన్ చేయాలని సివిల్ఏ వియేషన్ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విటర్‌‌లో సూచించారు. ఆ తర్వాత ఎయిరిండియా బుకింగ్స్ పేజీని క్లోజ్ చేసింది.

కరోనా కంట్రోల్ తర్వాతనే అనుమతి…

ప్రపంచవ్యాప్తంగా ఉన్నఅన్ని దేశాలు కరోనా వ్యాప్తి కోసం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం లేదు. కరోనా వైరస్ ను కంట్రోల్ చేసిన తర్వాత ప్రభుత్వం ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేసే అవకాశం ఉందని మరో సంబంధిత వర్గాలు తెలిపాయి.

Latest Updates