ఆరోగ్య సేతు డేటా ఫుల్ సేఫ్ : కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ డేటా సెక్యూరిటీ ప్రాబ్లమ్ లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింంది. యాప్ ద్వారా ఇప్పటివరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించబడలేదని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ నుంచి వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్ చేసే చాన్స్ ఉంది అంటూ ఓ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ మంగళవారం ట్విట్టర్​లో సవాలు చేశారు. 9 కోట్ల మంది ఇండియన్ల ప్రైవసీ ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. మరోవైపు యాప్ ను మరింత సెక్యూరిటీతో మెయింటేన్ చేయాడానికి కావాల్సిన సూచనలు చేశారు. ఆ హ్యాకర్ సవాలు, సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం యాప్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాత వివరణ ఇచ్చింది. ఆరోగ్యసేతు యాప్ వాడుతున్న ఏ ఒక్క యూజర్ కు సంబంధించిన సమాచారం కూడా హ్యాకింగ్ కు గురికాలేదని కాలేదని ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆ హ్యాకర్ వాదనలను తోసిపుచ్చిన కేంద్రం.. ప్రజల భద్రతకు సంబంధించిన అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశంలో ఎవరైనా ఆరోగ్య సేతు యాప్ లో సమస్యలు గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని సూచించింది.

Latest Updates