‘కొత్త’గా లక్షల జాబ్స్.. చేసెటోళ్లు లేరు!

  • నిపుణుల కొరతతో ఐటీ సతమతం: నాస్కామ్‌

బెంగళూరు: ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా ఎనలిటిక్స్‌ టెక్నాలజీకి డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టు సంబంధిత నిపుణులు మాత్రం ఐటీ రంగానికి దొరకడం లేదని నేషనల్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్ సాఫ్ట్‌‌వేర్‌‌ అండ్‌ సర్వీ సెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) వెల్లడించింది. కొత్త టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవసరమైనంత మంది దొరకడం లేదని, ఇప్పుడున్న ఉద్యోగుల్లో 50 శాతం మందికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిందేనని నాస్కామ్‌ (ఐటీ ఎనబుల్డ్‌‌ సర్వీ సెస్‌) సెక్టర్‌‌ స్కిల్స్‌ కౌన్సిల్‌‌ సీఈఓ అమిత్‌ అగర్వాల్‌‌ అన్నారు. ఇండియాలోని ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీలకు నాస్కామ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిమాండ్‌ కు తగినంత మంది నిపుణులు దొరక్కపోవడంతో ఐటీ పరిశ్రమ ఇబ్బందిపడింది. ఐటీ పరిశ్రమల్లోని వివిధ విభాగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు ఉండగా, నిపుణులు దొరక్కపోవడంతో1.40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారు. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 2021 నాటికి ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుల కొరత 2.30 లక్షలకు చేరునుంది. బిగ్ డేటా నిపుణుల కొరత 7.80 లక్షలకు చేరుతుందని అగర్వాల్‌‌ చెప్పారు.
కొత్త టెక్నాలజీలపై పట్టు తప్పనిసరి
‘ది ఫ్యూచర్‌‌ ఆఫ్ జాబ్స్‌ 2018’ పేరుతో వరల్డ్‌‌ ఎకనమిక్‌‌ ఫోరం (డబ్ల్ యూఈఎఫ్‌‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏఐ, డేటా ఎనలిటిక్స్‌ వంటి డిస్రప్టివ్‌, డిజిటల్‌‌ టెక్నాలజీలపై పనిచేసేందుకు వీలుగా ప్రపంచవ్యాప్తంగా 54 శాతం మంది ఉద్యోగులకు మళ్లీ శిక్షణ (రీస్కిల్డ్‌‌) ఇవ్వాలి. 2022 నాటికి బిగ్ డేటా ఎనలిటిక్స్‌ , క్లౌడ్‌ కంప్యూటింగ్‌‌ విభాగాలు ఐటీ రంగాన్ని శాసిస్తాయి. మిగతా విభాగాల్లో దాదాపు ఉద్యోగాలే ఉండకపోవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు ఈ కొత్త టెక్నాలజీలపై పట్టు సంపాద ించడం తప్పనిసరి. ‘‘కోట్లాది రూపాయల విలువైన ఐటీ పరిశ్రమ కొత్త ఉద్యోగాలు
కల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది. కొత్త టెక్నాలజీలపై పనిచేయగల నిపుణులను తయారు చేయగల సత్తా కూడా ఉంది. డిమాం డ్‌ –సప్లై మధ్య అంతరాన్ని పూడ్చగల శక్తి ఇండియా ఐటీ పరిశ్రమకు ఉంది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌‌, మాథమేటిక్స్‌ (స్టెమ్‌ ) విభాగాల్లో ప్రతిభావంతులకు మనదేశంలో కొరత లేదు’’ అని అగర్వాల్‌‌ వివరించారు.
కాలానికి అనుగుణంగా మారాల్సిందే…
ఐటీ పరిశ్రమ ఐఏ, మెషీన్‌‌ లెర్నింగ్‌‌, డేటా ఎనలిటిక్స్‌, ఆటోమేషన్‌‌, రోబోటిక్స్‌ , బ్లాక్‌‌చెయిన్‌‌, క్లౌడ్‌ , ఇంటర్నెట్‌ ఆఫ్‌‌ థింగ్స్ (ఐఓటీ) వంటి టెక్నాలజీ అందిపుచ్చుకుంటు న్నం దున, పాతతరం టెక్నాలజీలతో పనిచేసే కంపెనీలు వీటికి అనుగుణంగా మారకుంటే తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొనాల్సి రావొచ్చు. అందుకే 10 ముఖ్యమైన టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చి, వీలైనన్ని
ఎక్కువ ఉద్యోగాలను కల్పించడానికి నాస్కా మ్‌ ‘ఫ్యూచర్‌‌ స్కిల్స్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచు కోవడానికి ప్రత్యేక పోర్టల్‌‌ కూడా నిర్వహిస్తోంది. ఏఐ, సైబర్‌‌, సెక్యూరిటీ, ఐఓటీ, వర్చు వల్‌‌ రియాల్టీ, రోబో ప్రాసెస్‌ ఆటోమేషన్‌‌, బిగ్‌‌ డేటా ఎనలిటిక్స్‌ , బ్లాక్‌‌ చైన్‌‌, 3డీ ప్రింటింగ్‌‌, క్లౌడ్‌ కంప్యూట ింగ్‌‌, సోషల్‌‌, మొబైల్‌‌ రంగాల్లో అత్యధికంగా జాబ్స్‌ ఉంటాయని నాస్కా మ్‌ తెలిపింది. మొత్తం 10 కీలక టెక్నాలజీల్లో 70 రకాల ఉద్యోగాలు
ఉంటాయని, వీటికి 150 రకాల స్కిల్స్ అవసరమవుతాయని అగర్వాల్‌‌ వివరించారు. ఇప్పుడున్న ఉద్యోగులకు స్కిల్స్‌ నేర్పించడంతోపాటు విద్యార్థుల సిలబస్‌ లోనూ వీటిని చేర్చాలని నిపుణులు అంటున్నారు.  ఇందుకోసం నాస్కా మ్‌ ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలతో ఒప్పం దం కుదుర్చుకుంది. మానవ వనరుల అభివృద్ ధి, రీస్కిల్లింగ్‌‌ కోసం ఐటీ పరిశ్రమ రూ.10 వేల
కోట్లు ఖర్చు చేస్తోందని అగర్వాల్‌‌ వెల్లడించారు.

Latest Updates