ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు

no-state-is-given-special-status

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా విషయమై సోమవారం లోక్‌సభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, బీహార్‌, ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు  విజ్ఞప్తి చేశాయని ఆమె తెలిపారు. ప్రణాళిక మద్దతు కోసమే జాతీయాభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Latest Updates