
ఎస్టీపీపీ కోసం భూములచ్చిన నిర్వాసితుల గోడు
విద్యార్హతలు ఉన్నా అన్‌స్కిల్డ్ లేబర్‌గానే కొనసాగింపు
కనీస వేతనం లేదు.. ఉద్యోగ భద్రతా లేదు
న్యాయం కోసం మరోసారి ఆందోళనబాట
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణిధర్మల్పవర్ ప్రాజెక్టుకు భూములిస్తే మంచి నౌకరీలు ఇస్తామని అప్పట్లో ఆఫీసర్లు చెప్పారు. నిర్వాసితులతో పాటు ఎఫెక్టెడ్ ఏరియాలోని పబ్లిక్కు 2వేలకు పైగా జాబ్‌లు వస్తాయని, అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపెట్టారు. తీరా భూములు తీసుకొని అందులో ప్రాజెక్టు కట్టాక కేవలం 500 మందిని మాత్రమే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్కింద తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేండ్లు గడిచిపోయినా స్థానికుల్లో ఒక్కరినీ పర్మినెంట్ చేయలేదు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. ఏనాటికైనా ఉద్యోగాలు రెగ్యులరైజ్అవుతాయని, కనీస వేతనాలు వస్తాయనే ఆశతో నాలుగున్నర ఏండ్లుగా బాధితులంతా డెయిలీ వేజెస్‌తో నెట్టుకొస్తున్నారు.
నాలుగున్నర ఏళ్లలో పెరిగింది రూ.100
అన్‌స్కిల్డ్ లేబర్‌కు ప్రారంభంలో రూ.308 డెయిలీ వేజ్ చెల్లించగా, ప్రస్తుతం రూ.408 చెల్లిస్తున్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం రూ.100 మాత్రమే పెంచారు. నాన్లోకల్ఎంప్లాయీస్కు మాత్రం ప్రతి నెలా రూ.20వేలకు పైగా జీతాలు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ను సైతం బేఖాతరు చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆరోపిస్తున్నారు. స్థానికుల్లో చాలామందికి సరిపడా విద్యార్హతలున్నాయని, వారికి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్డ్లేబర్గా తీసుకునే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. – కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి రూ.18 వేలు లేదా కోల్ ఇండియా వేతనాలు ఇవ్వాలని, -కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యార్హతలను బట్టి సంబంధిత డిపార్ట్మెంట్లలో సెమీస్కిల్డ్, సిల్డ్ ఎంప్లాయీస్‌గా నియమించాలని, కార్మిక చట్టాల ప్రకారం ఎంప్లాయీస్ అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర వెల్ఫేర్ స్కీములు వర్తింపజేయాలని డిమాండ్చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుసార్లు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మళ్లీ రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం పవర్‌మెక్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు డ్యూటీ బహిష్కరించి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. సోమవారం నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎస్టీపీపీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వెల్ఫేర్అండ్ప్రొటెక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్. రాజేందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ డి.భాస్కర్ చెప్పారు.
రెగ్యులరైజ్ చేయాలి
పవర్ ప్లాంట్ ఏర్పాటయితే మాకు ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్రాంతం డెవలప్అవుతుందని ఆశపడ్డం. విలువైన భూములను ప్లాంట్ కు ఇచ్చినం. కానీ సింగరేణి సంస్థ మమ్మల్ని మోసం చేసింది. నాలుగు సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం. సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేయాలి.
‑ సీహెచ్. రాజేందర్ రెడ్డి, సీఏడబ్ల్యూపీ ప్రెసిడెంట్
సింగరేణి పట్టించుకోవట్లే
పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్లు నార్త్ ఇండియా నుంచి లేబర్ ను తీసుకొస్తున్నారు. శాలరీస్, వెల్ఫేర్ విషయంలో వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భూ నిర్వాసితులను, లోకల్స్ ను చిన్నచూపు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తాం.
‑ డి.భాస్కర్, సీఏడబ్ల్యూపీ జనరల్ సెక్రటరీ
For More News..