ప్లేయర్లకు ట్రెయినింగ్ క్యాంప్స్ నిర్వహించబోం

స్పష్టం చేసిన బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, స్టేడియాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పోర్టింగ్ కార్యక్రమాలు తిరిగి పునరుద్ధరిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ మాత్రం ఈ విషయంలో తొందరపడబోమని తెలిపింది. ఇప్పట్లో బోర్డు కాంట్రాక్ట్ ప్లేయర్లకు ట్రెయినింగ్ క్యాంప్స్ నిర్వహించబోమని స్పష్టం చేసింది. అలాగే స్టేట్ అసోసియేషన్స్ లోకల్ లెవల్ లో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించడంపై సమాలోచనలు జరుపుతున్నామని తెలిపింది. ఆదివారం కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్టేడియమ్స్ మళ్లీ తెరిచినా.. ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ దీనిపై స్పందించింది.

‘విమాన ప్రయాణాల మీద ఆంక్షలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 31 వరకు ఎయిర్ ట్రావెలింగ్ కు ఆస్కారం లేదు. కాంట్రాక్ట్ ప్లేయర్లకు స్కిల్ బేస్డ్ ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహించడానికి ముందు మరికొంత కాలం ఎదురుచూస్తాం. స్టేట్ లెవల్ గైడ్ లైన్స్ ను పరిశీలిస్తున్నాం. స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ తో మాట్లాడుతున్నాం. టీమ్ మేనేజ్ మెంట్ తో బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ ఇంటరాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి పరిస్థితులు అదుపులోకి వస్తే టీమ్ ఏం చేయాలనే దానికి సంబంధించిన సరైన ప్లాన్స్ ను ఆఫీస్ బేరర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆటగాళ్లు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ సేఫ్టీ మాకు చాలా ముఖ్యం. అందుకే ఏ నిర్ణయం తీసుకోవడానికైనా తొందరపడబోం’ అని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తెలిపారు.

Latest Updates