ఆన్​లైన్ క్లాసులతో ఫాయిదా లేదు

70.9 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయం ఇదే
అర్థంకావడం లేదంటున్న 68.7% మంది స్టూడెంట్స్
ఫోన్ ఉన్నా డేటా లేని ఫ్యామిలీలు 58.7 శాతం
రాష్ట్రంలోని 1,868 గ్రామాల్లో టీఎస్యూటీఎఫ్ సర్వే
22 వేల ఫ్యామిలీలు, 39 వేలమంది స్టూడెంట్లనుంచి వివరాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్ కారణంగా మూతపడిన ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్లు ఆన్ లైన్ లో చెప్తున్న క్లాసుల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని చాలామంది పేరెంట్స్ చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని వెంటనే ఆఫ్​లైన్​లో స్కూల్స్ ​ప్రారంభించాలని అంటున్నారు. మరోవైపు స్టూడెంట్స్​ కూడా ఆన్​లైన్​ క్లాసులు తమకు అర్థం కావడం లేదని చెప్తున్నారు. అకడమిక్ ఇయర్ నిర్వహణ, స్కూల్స్ నిర్వహణ, ఆన్​లైన్ క్లాసులు మొదలైన అంశాలపై టీఎస్​యూటీఎఫ్ ​స్టేట్ వైడ్​గా జూన్ 22 నుంచి 27 వరకూ సర్వే నిర్వహించింది. 33 జిల్లాల్లో 489 మండలాల్లోని 1,868 గ్రామాల్లో 22,502 మంది పేరెంట్స్, 39,659 మంది స్టూడెంట్స్ అభిప్రాయాలను సేకరించింది. దీంట్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వెంటనే ఆఫ్​లైన్​లో క్లాసులు ప్రారంభించాలని 93.4 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడగా, 6.6 శాతం మంది ఆన్ లైన్​లో బోధించాలని చెప్పారు.

ఆన్​లైన్ క్లాసులు అర్థమైతలే…
ఆన్​లైన్ క్లాసులపై 9,201 మంది పిల్లల అభిప్రాయాలను సేకరించారు. దీంట్లో 6,321(68.7శాతం) ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావడం లేదని, 331 మంది (3.6 శాతం) అర్థమవుతున్నాయని చెప్పారు. కొంత మేరకు అర్థమవుతుందని 2,549(27.7 శాతం) అభిప్రాయపడ్డారు. ఆన్​లైన్ క్లాసులపై 5,220 మంది పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకోగా.. వారిలో 232(4.4 శాతం) మంది ఉపయోగకరమని, 3,701(70.9 శాతం) మంది యూజ్ లేదనీ, పాక్షికంగా బెటర్ అని 1,289(24.7 శాతం) మంది అభిప్రాయపడ్డారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు ఆన్​లైన్ క్లాసులు నిర్వహించడం లేదని 7,667(85.5 శాతం), నిర్వహిస్తున్నారని 1,335 (14.5 శాతం) స్టూడెంట్లు తెలిపారు.

స్మార్ట్ ఫోన్ లేని వారు 39.6 శాతం
స్మార్ట్ ఫోన్ ఎంతమందికి ఉందని 21,579 కుటుంబాలను అడగ్గా 8,911(39.6 శాతం) ఫ్యామిలీలు లేవని చెప్పాయి. 11,003 (48.9 శాతం) కుటుంబాల్లో ఒక స్మార్ట్​ ఫోన్, 1,665 (7.4 శాతం) ఫ్యామిలీలు రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని తెలిపాయి. ఫోన్ ఉన్న కుటుంబాల్లో 22 శాతమే పిల్లలకు వెసులుబాటు ఇస్తున్నారు. 13,591 మందిని ఫోన్​లో డేటా కనెక్షన్​ ఉందా, అది ఆన్​లైన్ క్లాసులకు సరిపోతుందా అని అడగ్గా సరిపోతుందని 1,495(11 శాతం), డాటా కనెక్షన్​ ఉందిగానీ సరిపోదని 4,118(30.3 శాతం), డేటా కనెక్షనే లేదని చెప్పిన వారు 7,978(58.7 శాతం) తెలిపారు.

రిపోర్టును రిలీజ్ చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
టీఎస్ యూటీఎఫ్ సర్వే రిపోర్టును టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం రిలీజ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శారద తదితరులున్నారు.

కొన్ని ముఖ్యాంశాలు..

చదువుకుంటున్న పిల్లలు ఒక్కరున్న కుటుంబాలు 36.6%, ఇద్దరున్నవి 48.3%, ముగ్గురున్నవి 10.5శాతం ఉన్నాయి.
సర్వేలో పాల్గొన్న సర్కారీ బడుల పిల్లలు 30,458(76.8 శాతం), ప్రైవేటు స్కూళ్ల పిల్లలు 9,201(23.2 శాతం).
ఇంటర్నెట్ సౌకర్యం 9.7 శాతం ఇండ్లలో ఉండగా, 90.3 శాతం ఇండ్లలో లేదు.
85.2 శాతం ఇండ్లలో టీవీ ఉండగా, 14.8 శాతం ఇండ్లలో లేదు.
ఇంటర్నెట్ సౌకర్యం 23.8 శాతం స్కూళ్లలో ఉండగా, 68.3 శాతం స్కూళ్లలో లేదు. 7.9 శాతం మంది తెలియదని చెప్పారు.
స్కూల్​కు 65.2% స్టూడెంట్లు నడిచి, 11.5 % మంది బస్సులో, మిగిలిన వారు ఇతర వాహనాల్లో వెళతామన్నారు.
87.5 శాతం స్కూల్​లో మంచినీటి సౌకర్యం ఉందని, 5.4 శాతం స్కూళ్లలో లేదని తేలింది. మరో 7.1 శాతం మంది వాటర్ ఉన్నా తాగలేమని చెప్పారు.
81.5 శాతం బడుల్లో టాయ్ లెట్, శానిటేషన్ సౌకర్యం ఉందని, 7.2 శాతం లేవని, ఉన్నా పనిచేయడం లేదని 11.3 శాతం మంది చెప్పారు.
క్లాసురూమ్స్ ఫిజికల్ డిస్టెన్స్​ పాటించేలా ఉన్నాయని 60.3 శాతం అభిప్రాయపడగా, లేవని 39.7 శాతం మంది చెప్పారు.

For More News..

చిరుతెక్కడ? 50 రోజులైనా జాడ లేదు

ఆర్టీసీలో వద్దన్నరు..  సింగరేణిలో సై అన్నరు

గేట్లెత్తితే పోయేదానికి ఎత్తిపోస్తున్నరు

Latest Updates