కరోనాకు వ్యాక్సిన్ రాలేదు.. వచ్చే ఛాన్సే లేదు

హైదరాబాద్: కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెహరి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. కరోనా వైరస్‌‌తోపాటు వ్యాక్సిన్ అందుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా మన జీవితంలో భాగం అవుతుంది. కరోనాకు వాక్సిన్ వస్తుంది అంటున్నారు కానీ అది నిజం కాదు. ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. ఇకపై వచ్చే అవకాశం కూడా లేదు. ఈ వైరస్ మన జీవితాంతం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం. మానసికంగా అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడ్ని నమ్మాలి. పెద్దలు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కరోనా నిమోనియాకు సంబంధించినది కాబట్టి చన్నీళ్లతో స్నానాలు చేయొద్దు. వేడి నీళ్లతో స్నానాలు చేయాలి. నేడు కరోనా, కేన్సర్ రెండు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి’ అని బాలయ్య పేర్కొన్నారు.

Latest Updates