వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి కేటగిరీలు ఉండొద్దు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఎలాంటి కేటగిరీలు ఉండకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌‌లో వీఐపీ లేదా నాన్-వీఐపీ కేటగిరీలు ఉండొద్దని కేజ్రీవాల్ సూచించారు. ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమైని, వ్యాక్సిన్‌‌ను ముందుగా కరోనా వారియర్స్‌‌కు అందించాలన్నారు.

‘మొత్తం ప్రపంచం వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది. ఢిల్లీ సర్కార్ కూడా వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీని ఎలా చేపట్టాలనే దానిపై ప్లాన్స్‌‌ను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఒకవేళ కేంద్రం మా సలహాలు అడిగితే.. వ్యాక్సిన్ పంపిణీలో వీఐపీ, వీఐపీయేతర లాంటి కేటగిరీలు ఉండకూడదని సూచిస్తాం. ప్రతి పౌరుడి ప్రాణమూ కీలకమే. తొలుత కరోనా వారియర్స్‌‌కు వ్యాక్సిన్‌‌ అందించాలి. ఆ తర్వాత వృద్ధులకు టీకాను అందించాలి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Latest Updates