స్పెషల్ బీర్లు తాగితే బరువు పెరగరంట..

బ్యాక్టీరియా బీరు.. మస్తు హుషారు
అమెరికా రీసెర్చర్ల స్టడీలో వెల్లడి

అరే నాకు బీర్లు వద్దురా బై. ఇప్పటికే పొట్ట పెరిగింది. మందే పోయిండ్రి’ అని మందు పార్టీల్లో కొందరు చెప్తుంటరు. బీర్లు ఎక్కువగా తాగితే లావు అయిపోతుండటమే అందుకు కారణం. కానీ.. కొన్నిస్పెషల్ బీర్లు తాగితే మాత్రం.. పొట్ట పెరగదట. ఒబెసిటీ అనే మాటే ఉండదట. మంచిగా నిద్ర పడ్తదట. ఆరోగ్యం కూడా మస్త్ హుషారుగా ఉంటదట. మంచిగనే ఉన్నట్లున్నయ్. ఏం బీర్లవి? ఎక్కడ దొరుకుతయ్? అంటున్నరా. అవి ప్రోబయోటిక్ బీర్లు. అంటే.. బ్యాక్టీరియా, ఈస్ట్ బీర్లన్నమాట! ప్రస్తుతం బెల్జియం కంపెనీలు వీటిని ఎక్కువగా తయారు చేస్తున్నయి. వీటిలో మన ఆరోగ్యా నికి మంచి చేసే ఈస్ట్, బ్యాక్టీరియాలు ఫుల్లుగా ఉంటాయని, అందుకే ఈ బీర్లతో ఆరోగ్యం మంచిగుంటదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా రీసెర్చర్లు చెబుతున్నారు.

ఒక్క బీరులో 5 కోట్ల బ్యాక్టీరియాలు బ్రూవరీల్లో మాల్టెడ్ బార్లీ వంటి పదార్థాలను ఫర్మంటేషన్ (పులి యబెట్టడం) చేయడం ద్వారా బీర్లు తయారు చేస్తారు. బార్లీ పదార్థా న్ని ఈస్ట్‌లు ఫర్మంటేషన్ చేసి, గ్లూకోజ్, ఆల్కహాల్, సీవోటూగా మారుస్తాయి. అయితే, ప్రోబయోటిక్ బీర్లలో ఫర్మంటేషన్ రెండుసార్లు జరుగుతుందట. మామూలుగా బ్రూవరీల్లో ఒకసారి ఫర్మంటేషన్ చేసి, బీరును సీసాల్లోకి నింపుతారు. ఆ తర్వాత సీసాల్లోనూ రెండో సారి ఫర్మంటేషన్ జరుగుతుందని, దీనివల్ల ఆ బీరు టేస్టే ఒక రేంజ్‌లో ఉంటుందని అమెరికా రీసెర్చర్లు వెల్లడించారు. ఇలా తయారు చేసిన కొన్‌ని బాటిళ్లను తాము పరీక్షించగా, ఒక్క బాటిల్లో సుమారుగా 5 కోట్ల మంచి బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలిందన్నారు.

మంచి ఎట్ల చేస్తయి?
మామూలుగానే మన పేగుల్లో కోట్లాది మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటయి. చెడు బ్యాక్టీరియాలను అంతం చేసే బ్యాక్టీరియాల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. వాటినే ప్రోబయోటిక్ (మంచి) బ్యాక్టీరియాలు అంటాం. ఆటిజం, పేగు కేన్సర్‌కు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాలను కూడా అవి చంపుతాయని, అందుకే వీటి సంఖ్య ఎంత పెరిగితే మనకు అంత మంచిదని చెబుతారు. అయితే, ప్రోబయోటిక్ బీర్ల తయారీలో ఒక ప్రత్యే కమైన ఈస్ట్‌లను వాడుతారని, అవి బీర్‌లోని చక్కెరలను కూడా ఆల్కహాల్‌గా మార్చడం వల్ల ఒబెసిటీ సమస్య ఉండదని రీసెర్చర్లు పేర్కొంటున్నారు. అలాగే ఇవి చెడు బ్యాక్టీరియాను ఖతం చేసే యాసిడ్‌లను కూడా రిలీజ్ చేస్తాయని, దానివల్ల హెల్త్ కూడా మంచిగుంటదని అంటున్నారు.

Latest Updates