భౌతికశాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబుల్ అవార్డు

2019 సంవత్సరానికి గాను.. భౌతికశాస్త్రంలో నోబుల్ పురస్కారాలను ప్రకటించారు. ఈ సారి ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబుల్ అనౌన్స్ చేశారు. భౌతికాంశాలపై చేసిన పరిశోధనలకు గాను.. కెనడాకు చెందిన అమెనికన్ జేమ్స్ పీబుల్స్ ను అవార్డు వరించింది. సూర్యుడిని పోలి ఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాన్ని కనుగొన్నందుకు స్విట్జర్లాండ్ కు చెందిన మైఖెల్ మేయర్, డైడియర్ క్యూలోజ్ లకు సంయుక్తంగా నోబుల్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 10న స్టాక్ హోంలో జరిగే కార్యక్రమంలో వీరు పురస్కారాలు అందుకోనున్నారు.

Latest Updates