రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

2019 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడి నోబెల్ పురస్కారం లభించింది. లిథియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు గాను జాన్ బి గూడెనఫ్, స్టాన్లీ వైటింగ్‌హామ్ మరియు అకిరా యోషినోలకు శాస్త్రవేత్తలకు ఈ  పురస్కారాన్ని ప్రకటించారు. మొబైల్ ఫోన్‌ల నుండి రిమోట్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల్లోవాడుతున్న లిథియం అయాన్  బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు ఈ బహుమతిని ప్రధానం చేస్తున్నామని నోబెల్ తెలిపింది.  ఈ బహుమతిని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రధానం చేస్తుంది. 97 ఏళ్ళ వయసులో జాన్ బి గూడెనఫ్ ఈ బహుమతి అందుకోనున్నారు. ఆయనతో పాటు జపనీస్ కెమిస్ట్ అకిరా యోషినో మరియు బ్రిటిష్ కెమిస్ట్ స్టాన్లీ వైటింగ్‌హామ్‌ లు ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందుకోనున్నారు.

Latest Updates