ఆర్థిక రంగంలో ముగ్గురికి నోబెల్‌

ఆర్థిక రంగంలో ముగ్గురికి సంయుక్తంగా నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ నోబెల్ అవార్డుకు మరో భారతీయుడు ఎంపికయ్యారు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ అవార్డు అందుకోనున్నారు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితో పాటు మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచ పేదరికాన్ని తొలగించడానికి ఈ ముగ్గురు పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ అవార్డు దక్కింది.

Latest Updates