బర్త్ డే, ప్రీవెడ్డింగ్ వేడుకలకు మెట్రో బుక్ చేసుకోవచ్చు

ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యం కల్పించిన నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్. అఫీషియల్ లేదంటే ప్రైవేట్ ఈవెంట్స్ ఫ్రీ వెడ్డింగ్, బర్త్ డే వేడుకల కోసం మెట్రో రైలును బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది. మెట్రో కోచ్ అయితే గంటకు రూ.5వేలు ఛార్జ్ చేస్తారు. పూర్తి మెట్రో రైలును బుక్ చేసుకుంటే గంటకు 10 వేలు కట్టాల్సి ఉంటుందని నోయిడా మెట్రో రైల్ ఎండీ రీతు మహేశ్వరి తెలిపారు. మెట్రో వయబిలిటీ పెంచడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతోనే మెట్రో బుకింగ్స్ ఫెసిలిటీ తీసుకొచ్చామన్నారు.

ఈ వెంట్స్ కు మెట్రో సేవలను నాలుగు కేటగిరీలుగా విభజించారు.

  • డెకరేట్ చేయని మెట్రో, ఒక కోచ్, రన్నింగ్ మెంట్రో  – రూ. 8,000
  • డెకరేట్ చేయని మెట్రో, ఒక కోచ్, ఆగి ఉన్న మెట్రో – రూ. 5,000
  • డెకరేట్ మెట్రో, ఒక కోచ్ , రన్నింగ్ మెట్రో – రూ. 10,000
  • డెకరేట్ మెట్రో ,ఒక కోచ్ , ఆగి ఉన్న మెట్రో –  రూ. 7,000

కండీషన్స్ 

  • రూల్ ప్రకారం, మెట్రో ప్రాంగణాన్ని అద్దెకు తీసుకోవాలనుకునే వారు కనీసం 15 రోజుల ముందుగానే అప్లై చేయాలి.
  • మెట్రోలో పిల్లలు, పెద్దలతో కలిసి 50 మంది వరకే పర్మిషన్
  • ఆగి ఉన్న మెట్రో  రాత్రి 11 నుండి తెల్లవారుజాము 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
  • ఒక రైలులో  నాలుగు బోగీల వరకు బుక్ చేసుకోవచ్చు 
  • బుక్ చేసుకునే వారు ముందస్తుగా  సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 20,000  చెల్లించాలి. 

see more news

కేంద్రం రాష్ట్రాలకు సహకరించడం లేదు

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Latest Updates