ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జీహెచ్ఎంసీలో  ఆర్వో ప్రియాంక నామినేషన్లు స్వీకరించారు. సోమవారం వరకు  59 మంది అభ్యర్థులు మొత్తం 90 సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు. ఇవాళ టీడీపీ అభ్యర్థి ఎల్. రమణ, ఇతర స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 24న నామినేషన్లు పరిశీలిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణ. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ . మార్చి 17 న ఓట్లు లెక్కింపు ఉంటుంది.

Latest Updates