దుబ్బాకలో నామినేషన్ల సందడి… భారీ బందోబస్తు

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నామినేషన్లు వేసేందుకు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తున్నారు.  పటిష్టమైన పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నారు పోలీస్‌ అధికారులు. నిన్నటి నుంచి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల నామినేషన్‌ పక్రియ ప్రారంభమైంది. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం పక్కన దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు పక్రియ కొనసాగుతోంది. ఆయా పోలింగ్‌ స్టేషన్లలో ఉప ఎన్నికలు జరుగనున్న సందర్భంగా, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను ప్రజాప్రతినిధులందరూ తప్పకుండా పాటించాలా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల, పోలీసు సిబ్బందికి సహకరించాలని… దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు అధికారులు.

Latest Updates