ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆలస్యం?

హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్ల పై కోర్టు స్టే ఉంది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరో సారి విచారించనుంది. హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల నేపథ్యంలో ఈనెల 23 నుండి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం మరో మూడు నాలుగు రోజులు వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates