బ్రెయిన్ తో కంప్యూటర్ కంట్రోల్!

కంప్యూటర్ యుగం నడుస్తోందిప్పుడు. ఏ పనిచేయాలన్నా అది లేనిదే సాగదు. అలాంటి కంప్యూటర్ తో మన మెదడు అనుసంధానమైతే ఎలా ఉంటుంది? టెమ్యాట్రిక్స్​ అనే ఇంగ్లిష్ సినిమా చూశారా? ఆ సిని మాలో మెదడులోకి కొన్ని మందులిచ్చి ఊహా ప్రపంచంలోకి నెట్టేస్తారు. అలా మనిషిశరీరంలోని బయో ఎనర్జీని వాడుకుని యంత్రాలుమనుషుల్ని కంట్రోల్ చేసేలా చేస్తారు. ఇక్కడాఅంతే.. కాకపోతే రివర్స్​. కంప్యూటర్ ను మెదడుతో నియంత్రిస్తారు. నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​, ఇతర సంప్రదాయ కంప్యూటింగ్ మోడల్స్​తో మెదడును నిరంతరాయంగా కంప్యూటర్ కు కనెక్ట్​ చేస్తున్నారు. దీనికి సంబంధిం చిన కథనం ఫ్రాంటియర్స్​ ఇన్ న్యూరోసైన్స్​లో పబ్లిష్ అయింది. రాబర్ట్​ ఫ్రీటాస్ జూనియర్ అనే సీనియర్ సైంటిస్టు ఈ రీసెర్చ్​కు నేతృత్వం వహించారు. దీన్ని నిజం చేయడానికి మెదడులోకి కొన్ని నానో బాట్ లను పంపుతారు. అవేసూపర్ కంప్యూటర్లు, మనిషి మెదడుకు మధ్య వారధుల్లా పనిచేస్తూ సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు దోహదం చేస్తాయన్నమాట. ఈ నానో బాట్ లుబ్లడ్ బ్రెయిన్ బారియర్ (బీబీబీ అంటే శరీరంలోనిరక్తప్రసరణ వ్యవస్థను మెదడుతో అనుసంధానిం చేవ్యవస్థ)ను దాటి మెదడు కణాలను నావిగేట్ చేస్తాయి.కంప్యూటర్ నుంచి మెదడుకు, మెదడు నుంచి కంప్యూటర్ కు సమాచారాన్ని చేరవేస్తాయి. అయితే,అది.. చెబుతున్నంత తేలిక కాదని చెబుతున్నారు.మనిషి శరీరాన్ని తట్టుకునేలా బయోడిస్ట్రిబ్యూషన్ ,బయోకం పాటిబిలిటీ నానో బాట్స్​కు ఉండాలంటున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది నిజమయ్యే అవకాశాలుంటాయని వివరిస్తున్నారు.

 

 

Latest Updates