ప్రొజెక్టైల్స్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఇవాళ(గురువారం) కొన్ని ప్రొజెక్టైల్స్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తెలిపింది. ఇటీవల పలు  తక్కువ శ్రేణి క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలో ఉన్న సినోరై ప్రాంతం నుంచి ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించారు. అణు నిరాయుధీకరణ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన రెండు దఫా చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను చేపడుతూనే ఉంది. ఇటీవల వ్యూహాత్మక ఆయుధాలను కూడా కిమ్‌ టీమ్‌ పరీక్షించింది. ఆ క్షిపణి సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది.