జెట్ ఎగరాల్సిందే..ఎస్బీఐ ఛైర్మన్ రజ్నీష్

న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌ వేస్‌ ను ఎగిరేలా చేయడానికి ఆర్థిక సంస్థలు,బ్యాంక్‌ లు శతవిధాలా యత్నిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ చెప్పారు. రజ్నీష్ కుమార్ బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధానమంత్రిప్రధాన కార్యదర్శి న్రుపేంద్ర మిశ్రాలతో సమావేశమయ్యారు. జెట్‌ విమానాలు ఎగిరేలా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్ తున్నట్టు చెప్పారు.జెట్‌ ఎయిర్‌ వేస్ కోసం బ్యాంక్‌ లు, ఆర్థిక సంస్థలు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా రూపొందిస్తున్నాయి. మేనేజ్‌ మెంట్‌ లో మార్పులు చేపట్టడం ద్వారా జెట్‌ పునర్వ్యస్థీకరణ ప్రణాళికను బ్యాంక్‌ లు రూపొందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

జెట్‌ ఎయిర్‌ వేస్‌ లోకి కొత్త ప్లేయర్‌ ను తీసుకొస్తున్నారా? అని ఎస్‌ఐచైర్మన్‌ ను ప్రశ్నిం చగా.. దీనిలో కొట్టి వేయడానికి ఏమీ లేదని సమాధానమిచ్చారు. మరోవైపు జెట్‌ లో తనకున్న 24 శాతం వాటాలను విక్రయించాలని ఎతిహాద్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. తమ 24 శాతం వాటాలను కొనుగోలు చేయాలని ఎస్‌బీఐను ఎతిహాద్ కోరింది. ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌లు, ప్రయాణికుల ప్రయోజనం మేరకు జెట్‌ ను ఎగిరేలానే చేస్తారని సంబంధిత వర్గాలు  చెబుతున్నాయి.మార్చి 31 వరకు వేతనాలు చెల్లిం చకపోతే ఏప్రిల్ 1 నుంచి విమానాలు ఎగరడం ఆపివేస్తామని జెట్‌ ఎయిర్‌ వేస్ పైలెట్ల యూనియన్ హెచ్చరించింది. అసలకే అప్పుల బెడదతో ముప్పుతిప్పలు పడుతున్న జెట్‌ కు, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది. లీజులు కట్టకపోవడంతో కొన్ని విమానాలు గ్రౌండ్‌ కే పరిమితమవుతున్నాయి. కేవలం 41 జెట్‌ ఎయిర్‌ వేస్ ఎయిర్‌ క్రాఫ్ట్‌‌‌‌లే అందుబాటులో ఉన్నాయని, వచ్చే వారాల్లో మరిన్ని పెంచుతామంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. జెట్ ఎయిర్‌ వేస్‌ ను ఇన్‌ సాల్వెన్సీ , బ్యాం క్రప్ట్సీ కోడ్(ఐబీసీ) కిందకు తీసుకెళ్లడమనేది చిట్ట చివరి ఆప్షన్‌ అని ఎస్‌ బీఐ చైర్మన్ కూడా చెప్పారు.

Latest Updates