కూలీలను తెచ్చేందుకు ఇది కరెక్ట్‌ టైం కాదు

  • యూపీ సీఎంకు.. నితిన్‌ గడ్కరీ సూచన

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను సొంత ఊళ్లకు తిరిగి తెచ్చేందుకు ఇది సమయం కాదని ఆ రాష్ట్రం సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచడం ఉత్తమం అని ఆయన అన్నారు. “ మైగ్రెంట్స్‌ను సొంత ఊళ్లకు తీసుకొస్తామని యూపీ సీఎం ప్రకటించినట్లు తెలిసింది. అది సరైన నిర్ణయం కాదు. కరోనా వ్యాధి అన్ని చోట్ల ఉంది. కూలీల వల్ల వ్యాప్తి చెందితే కష్టం. దానికి బదులు వాళ్లు ఉన్న చోటే వాళ్లకు ఏదైనా సాయం చేసేలా ప్రాణాళిక రూపొందించుకోవాలి” అని నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆదిత్యనాథ్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీహార్‌‌ సీఎం నితీశ్‌ కుమార్‌‌ కూడా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న యూపీకి చెందిన వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest Updates