రెవెన్యూలో అందరూ అవినీతి పరులుండరు

హైదరాబాద్: అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ అన్నారు. చట్టం రూపకల్పనలో వీఆర్వోల పాత్ర ఉండాలన్నారు. అవినీతి లేని శాఖ ఉందా?, ఒక్కరిద్దరు అవినీతి చేస్తే అందరకీ శిక్షనా? అని ప్రశ్నించారు. తమ కష్టాన్ని గుర్తించకుండా తమపై అవినీతి ముద్ర వేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. VROలకు శాఖ మార్చొద్దని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సతీష్.

Latest Updates