జొమాటో సర్వే.. ఐపీఎల్ విజేత ఎవరు?

Not Just IPL, Dhoni’s Chennai Super Kings is Also Winning Big on Food Delivery Apps

ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో  ఐపీఎల్-2019 పై ఓ సర్వే చేస్తోంది. ఐపీఎల్ విజేత ఎవరో అంచనా వేయమని  తన కస్టమర్స్ ను కోరింది. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి చేపట్టిన ఈ సర్వేలో విజేతలెవరో గెస్ చేస్తే వారికి తమ సంస్థ తరపు నుంచి క్రెడిట్ పాయింట్స్ లభిస్తాయని తెలిపింది.

ఈ సర్వేలో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టాప్ లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్..  ఐపీఎల్ మ్యాచ్ లలో విజయాల్ని సాధిస్తూ తిరుగులేని టీమ్ గా దూసుకెళ్తోంది. గత ఏడాది ట్రోఫీని సాధించిన ఈ టీమ్ ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది కూడా సెమీస్ కు చేరువై  గెలుపు దిశగా పరుగెడుతోంది. టోర్నీలోనే కాదు.. బయట నిర్వహిస్తున్న కాంపిటీషన్స్, సర్వేల్లోనూ చెన్నైకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

దేశమంతటా 224 నగరాల్లో జొమాటో చేసిన సర్వేలో ఎక్కువ మార్కులు సీఎస్కేకే పడ్డాయి. సర్వేలో 189 సిటీలు CSK కే అనుకూలంగా ఓటేశారు. కోటి 40లక్షల మంది యూజర్లు.. చెన్నైకే జై కొట్టారు. సర్వేలో వీరిది 20 శాతం. ఐతే… ముంబై ఇండియన్స్ కూడా చెన్నైకి … జొమాటో సర్వేలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ముంబైకి మద్దతుగా 18 శాతం మంది ఓటేశారు.

విశేషమేంటంటే ఎక్కువ శాతం ప్రిడిక్షన్స్ ఢిల్లీ నుంచి , తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ప్రాంతం నుంచి వచ్చాయి.

Latest Updates