రోహిత్‌‌కు తగినన్ని చాన్స్‌‌లిస్తాం : కోహ్లీ

విశాఖపట్నం:  టెస్ట్‌‌ ఓపెనర్‌‌గా కుదురుకునేందుకు రోహిత్‌‌శర్మకు తగినన్ని అవకాశాలిస్తామని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ తెలిపాడు. ఒకవేళ రోహిత్‌‌ సక్సెస్‌‌ అయితే టెస్ట్‌‌ల్లో టీమిండియా టాపార్డర్‌‌ మరింత బలంగా తయారవుతుందని కోహ్లీ అన్నాడు. ‘టెస్ట్‌‌ల్లో తన గేమ్‌‌ను తాను అర్థం చేసుకునేదాకా ఓపెనర్‌‌కు సమయవివ్వాలి.  అందుకే మేము రోహిత్‌‌ను  తొందరపెట్టం, కుదురుకునేందుకు తగినన్ని చాన్స్‌‌లిస్తాం. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌‌ మాదిరిగా రోహిత్‌‌ ఆడితే మాకు సంతోషమే. అయితే అతను తన స్టైల్‌‌లో ఆడాలనుకుంటున్నాం కానీ ఫలానా ప్లేయర్‌‌లా ఆడాలని మేం కోరుకోవడం లేదు’ అని కోహ్లీ చెప్పాడు.

 

Latest Updates