కాశ్మీర్ అంశం తేలే వరకు శాంతి చర్చల్లేవ్

  • అక్కడి ప్రజల హక్కులను ఇండియా కాలరాస్తోంది
  • విభజించి పాలించే కుట్రలో భాగమే 370 రద్దు
  • పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి కామెంట్స్

వాషింగ్టన్: కాశ్మీర్ సమస్యను న్యాయ పద్ధతిలోపరిష్కరించకుండా ఇండియాతో ఎలాంటి శాంతిచర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని పాకిస్తాన్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ మంత్రి షా మహమూద్ఖురేషి అన్నారు. గురువారం అమెరికాలోని సెంటర్ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్ ) థింక్ ట్యాం క్ ను ఉద్దేశించి ఖురేషి మాట్లాడారు . కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియేటర్ గా వ్యవహరించాలన్న డిమాండ్ ను ఆయన మరోసారి గుర్తు చేశారు. ‘మా ప్రభుత్వం శాంతిని కోరుకుంటోంది.ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధికి దేశీయ ఎజెండాపై దృష్టి పెట్టడానికి మాకు శాంతి అవసరం. కానీ,కాశ్మీర్ ఇష్యూ తేలేం తవరకు ఇండియాకు ఎలాంటి మూల్యం చెల్లించేందుకు మేము రెడీగా లేము”అనిఖురేషీ అన్నారు. జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్రద్దును పాక్ తప్పుబట్టింది. కాశ్మీర్ విషయంలోఅంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఖురేషీ ఈ కామెంట్స్ చేశారు.

హిందూ దేశంగా మార్చే కుట్రపేదరిక నిర్మూలనకు ప్రయత్నించే బదులు దేశాన్నిహిందూ రాజ్యంగా మార్చే ప్రాజెక్టును ప్రారంభించిందంటూ మోడీ సర్కారుపై ఖురేషీ విమర్శలుగుప్పించారు. ప్రపంచం అంతా చూస్తుం డగానే హిందూత్వ, అఖండ్ భారత్ పేరిట వినాశకరమైన పరిణామాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. కాశ్మీర్ ప్రజలను విభజించి పాలించే కుట్రలోభాగంగా ఆర్టికల్‌‌ 370 రద్దు చేసిందని ఆరోపించారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ చట్టాలను,యునైటెడ్ నేషన్స్ తీర్మానాలను ఇండియా లెక్కచేయలేదన్నారు. కమ్యూనికేషన్ కట్ చేసి కాశ్మీరీలను ఇళ్లలోనే ఖైదు చేసిందని, కాశ్మీరీల హక్కులను కాల రాస్తోందని మండిపడ్డారు. ‘కాశ్మీర్.. ఇండియాలో భాగమని ఆ దేశం భావిస్తోంది. కానీ కాశ్మీర్ అంశం సెక్యూరిటీ కౌన్సిల్ ఎజెండాలో ఉండటం వలన ఆభావన ఖండించబడింది’అని అన్నారు. కాశ్మీర్ వివాదం  పరిష్కారానికి ట్రంప్ మధ్యవర్తిత్వం అందిస్తామని పలుమార్లు కామెంట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Latest Updates