ఐపీఎల్​ వీడేది లేదు: హర్భజన్‌‌‌‌ సింగ్​

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ను వీడే ముచ్చటే లేదని టీమిండియా సీనియర్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌ స్పష్టం చేశాడు. యూకే వేదికగా నిర్వహించనున్న 100 బాల్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ ‘ది హండ్రెడ్‌‌‌‌’ లీగ్‌‌‌‌ సంబంధించిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ జాబితాలో భజ్జీ పేరు ఉండటంతో  అతను ‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పి, ఐపీఎల్‌‌‌‌కూ దూరం కానున్నాడనే ప్రచారం జోరందుకుంది. రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటించని ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఇతర దేశాల లీగ్‌‌‌‌లు ఆడటానికి వీలు లేదనే బీసీసీఐ నిబంధన ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ వార్తలను భజ్జీ ఖండించాడు. ‘ ఐపీఎల్‌‌‌‌లో  చెన్నైకి ఆడటమే నా ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ. సీఎస్‌‌‌‌కే తరఫున ఇప్పటికే రెండు మంచి సీజన్లు ఆడా. మేం రెండుసార్లు ఫైనల్‌‌‌‌కు వెళ్లాం. ఇప్పుడు మూడో సీజన్‌‌‌‌పై దృష్టి పెట్టా.   బీసీసీఐ నిబంధనను ఉల్లంఘించను.  హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్‌‌‌‌ నుంచి కూడా పేరు తొలగించుకుంటా.  ఆ కాన్సెప్ట్‌‌‌‌ ఆసక్తికరంగా అనిపించింది. రూల్స్‌‌‌‌ నన్ను ఆడేలా చేస్తే మాత్రం తప్పుకుండా ఆ టోర్నీలో భాగమవుతా’ అని స్పష్టం చేశాడు.

 

Latest Updates