టీమిండియా పాక్ పై కోపంతో ఓడిపోలేదు : సర్ఫరాజ్‌

కరాచీ: ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. టోర్నీలో భారత్‌ ఓటమి అదొక్కటే. ఆ ఓటమితో పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై పాక్‌ మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. కోహ్లీసేన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదంటూ ఆ టీమ్ మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ విమర్శించాడు.

అయితే ఈ విషయంపై ఆదివారం పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ స్పందించాడు. ‘టీమిండియా కావాలని ఓడిపోయిందనటం సరైంది కాదు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మంచిగా రాణించడం వల్లే కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. అంతేకానీ అందులో వేరే ఉద్దేశమేమీ లేదు. ’ అని తెలిపాడు సర్ఫరాజ్‌.

పాక్ పై కోపంతో భారత్ ఓడిందని అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే..!

Latest Updates