ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదు: క్రిస్ గేల్

షార్జా: ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ఇప్పట్లో రిటైర్మెంట్‌‌ అయ్యే చాన్సే లేదని ‘యూనివర్స్​ బాస్‌‌’ క్రిస్‌‌ గేల్‌‌ అన్నాడు. కోల్‌‌కతాపై గెలిచిన తర్వాత తన టీమ్‌‌మేట్‌‌ మన్‌‌దీప్‌‌ సింగ్‌‌.. గేల్‌‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా.. ‘‘గేల్‌‌.. నువ్వెప్పుడూ రిటైర్‌‌ కావొద్దు’ అని మన్‌‌దీప్‌‌ కోరగా…  ‘క్యాన్సిల్‌‌ రిటైర్మెంట్‌‌. ఇప్పట్లో అది జరగదులే’ అంటూ గేల్‌‌ తనదైన శైలిలో స్పందించాడు. గేల్‌‌ స్ట్రగుల్‌‌ కావడం తాను ఇంతవరకు చూడలేదని మన్‌‌దీప్‌‌ అన్నాడు. అందుకే వీడ్కోలు కావొద్దని కోరానని చెప్పాడు. ‘గేల్‌‌ ఎప్పుడూ అద్భుతమైన టచ్‌‌లో ఉంటాడు. బ్యాటింగ్‌‌లో ఇబ్బంది పడ్డ సందర్భాలు లేనేలేవు. ఇలాంటి గొప్ప టీ20 ప్లేయర్‌‌ను నేనింత వరకు చూడలేదు. ఇలాంటి ప్లేయర్లు రిటైర్‌‌ కావొద్దు’ అని మన్‌‌దీప్‌‌ వ్యాఖ్యానించాడు. ఓవరాల్‌‌గా వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా నిలుపుకున్న పంజాబ్‌‌.. నాకౌట్‌‌ రేస్‌‌ను రసవత్తరంగా మార్చేసింది.

for more news…

Latest Updates