త్వరలోనే పీవోకే ఇండియాల కలుస్తది

న్యూఢిల్లీ: తమను ఇండియాలో  కలపాలని పాక్‌‌ ఆక్రమిత  కాశ్మీరీలు డిమాండ్‌ ‌చేసే రోజు త్వరలోనే వస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కామెంట్‌ ‌చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంత డెవలప్‌మెంట్‌ ‌జమ్మూ కాశ్మీర్‌‌ లో జరుగుతోందని చెప్పారు. ఎయిమ్స్‌‌, సెంట్రల్‌ ‌యూనివర్సిటీ సహా ఇంకా రకరకాల అభి వృద్ధి అక్కడ జరుగుతోందన్నా రు. 2014 నుంచి 2019 వరకు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘జమ్మూకాశ్మీర్ జన్‌‌ సంవాద్ ర్యాలీ ’ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌నాథ్ ఆదివారం మాట్లాడారు. ఇండియాను డబ్ల్యూహెచ్‌వో పొగడలేదా? లాక్‌‌డౌన్‌‌సరిగా పెట్టలేదని, కరోనాను సరిగా హ్యాండిల్‌‌ చేయలేదని కొందరు విమర్శిస్తున్నారని.. కానీ డబ్ల్యూహెచ్‌వో  లాంటి సంస్థలు ఇండియా ఎఫర్ట్ ను‌ పొగిడిన విషయం తెలుసుకోవాలని మంత్రి అన్నారు. లాక్‌‌డౌన్‌ ‌పెట్టకపోయుంటే  మన పరిస్థితేంటో ఊహకు కూడా అందేది కాదని చెప్పారు. పార్టీ తరఫున వర్చువల్‌ ‌ర్యాలీలు చేస్తున్నామని, దీన్ని బట్టి ఇండియన్‌ ‌పాలిటిక్స్‌‌‘డిజిటల్‌‌వరల్డ్‌‌’ వైపు అడుగులేస్తున్నాయని అన్నారు.

సైనిక బలాన్ని రక్షణకే  వాడుతం

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ చెప్పా రు. ఇండియా బలహీన దేశం కాదని, కొన్నేళలో   దేశ రక్షణ వ్యవస్థ బలంగా మారిందని వివరించారు. ఈ బలాన్ని వేరే వాళ్ళను  భయపెట్టడానికి  కాకుండా దేశ రక్షణ కోసమే వాడుతామని స్పష్టం చేశారు. బార్డర్‌ ‌సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనా చెప్పిందని, ఇండియా కూడా ఆ వైపు అడుగులేస్తోందని చెప్పారు. పొరుగు దేశాలతో వివాదాలను దాచి పెట్టబోమని, సరైన టైమ్‌‌లో పా ర్లమెంటు ముందు అన్ని వివరాలను ఉంచుతామని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

బీజేపీ క్యాడర్‌ కూడా అనుకోలే

ఒకానొక టైమ్‌‌లో బీజేపీ వర్కర్లు కూడా ఆర్టికర్టిల్‌‌370, 35ఏ లను కేంద్రం తొలగించబోదని అనుకున్నారని, కానీ మోడీ చేసి చూపించా రని రాజ్‌నాథ్‌ చెప్పారు. ‘జమ్మూకాశ్మీర్‌‌ డెవలప్‌మెంట్‌‌కోసం మా గవర్నమెంట్‌‌పని చేస్తోందనే మెసేజ్‌ను సక్సెస్‌‌ఫుల్‌‌గా జనంలోకి పంపాం. ఐదేళ్లలో  జమ్మూకాశ్మీర్‌‌ రూపురేఖలు మారుస్తాం. దాన్ని చూసి పీవోకే జనం తప్పకుండా ఇండియాలో  కలుస్తామంటారు. అలాగైతేనే తమ బతుకులు బాగుపడతాయని నమ్ముతారు. అలా జరిగిన రోజు పార్లమెంట్‌‌ రిజొల్యూషన్‌‌ లక్ష్యం కూడా నెరవేరినట్టే’ అన్నారు. గతంలో కాశ్మీర్‌‌లో ఆందోళనలు జరిగినప్పుడు పాకిస్థా న్‌‌, టెర్రరిస్ట్‌ ‌ఆర్గనైజేషన్ ‌ఐఎస్‌‌ఐఎస్‌‌జెండాలు కనబడేవని, ఇప్పుడు మన మూడు రంగుల జెండా ఎగురుతోందని చెప్పారు. ఆర్టికర్టిల్‌‌ 370 ఇష్యూపై ఇంతకుముందు పాకిస్థాన్‌‌ ను చాలా దేశాలు సపోర్ట్‌‌చేసేవని, ఇప్పుడు అనేక ముస్లిం దేశాలు ఇండియాకు మద్ద తిస్తున్నాయ ని చెప్పా రు. మలేసియా, టర్కీలాంటి దేశాలు ఇండియాకు సపోర్ట్  చేయడం లేదన్నా రు.

Latest Updates